ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజస్థాన్​లో ప్రకాశం పోలీసులపై దాడులు..! - police rides on Rajasthan

ప్రకాశం జిల్లాలో పలువురి పోలీసుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్​లను సృష్టించి, మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు రాజస్థాన్ వెళ్లిన జిల్లా పోలీసులపై నిందితులు దాడికి పాల్పడినట్లు సమాచారం. గ్రామస్థులంతా నిందితులతో కలిసి పోలీసులపై రాళ్లతో దాడి చేసి సెల్​ఫోన్లు లాక్కున్నట్లు తెలిసింది.

రాజస్థాన్​లో ప్రకాశం పోలీసులపై దాడులు
రాజస్థాన్​లో ప్రకాశం పోలీసులపై దాడులు

By

Published : Nov 29, 2020, 9:29 PM IST

Updated : Nov 30, 2020, 6:45 AM IST

గుర్తు తెలియని వ్యక్తులు ప్రకాశం జిల్లాలో ఎస్పీతో పాటు పలువురు సీఐ, ఎస్​ఐల పేర్లతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లను తెరిచి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అకౌంట్ల నుంచి డబ్బులు కావాలంటూ పలువురికి అభ్యర్ధనలు పంపించారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్​గా తీసుకొని కేసును ఛేదించే పనిలో పడ్డారు. ఆ అకౌంట్లు రాజస్థాన్​లోని భరత్ పూర్ జిల్లా జిహెగా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లాకుందన్ గ్రామంలోని వ్యక్తులు ప్రారంభించి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ఎస్​ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లు బృందంగా వారం రోజుల క్రితం రాజస్థాన్ వెళ్లారు. జీహెగా పోలీసులు సహకారంతో ఆదివారం ఉదయం నగ్లాకుందన్​కు చేరుకున్నారు. నిందితుల కోసం వెతుకులాట చేస్తున్న సమయంలో గ్రామస్థులు పోలీసులపై దాడికి దిగినట్లు తెలిసింది. రాళ్లు రువ్వి, పోలీసుల వద్ద ఉన్న సెల్​ఫోన్​లను లాక్కున్నట్లు సమాచారం.. ఈ దాడిలో ఒకరికి స్వల్పంగా గాయాలయినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఏడుగురు అనుమానితులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఈ దాడి సమాచారాన్ని జిల్లా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Last Updated : Nov 30, 2020, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details