ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడవ భార్యాభర్తలది.... గాయం మాత్రం మరొకరిది! - attack on sister in law in peda uyyalavada

భార్యకు ఆడపడుచు వరసైన మహిళ గొంతు కోసి పరారయ్యాడో ఘనుడు. తనకు, తన భార్యకు జరుగుతున్న గొడవల్లో సర్ది చెప్పటానికి వచ్చిన ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెదఉయ్యాలవాడలో జరిగింది.

attack on sister in law in peda uyyalavada
గొడవ భార్యభర్తలది.... గాయం వదినది..

By

Published : Jan 8, 2020, 11:31 PM IST

Updated : Jan 9, 2020, 4:04 PM IST

గొడవ భార్యభర్తలది.... గాయం వదినది..

ప్రకాశం జిల్లా పెద ఉయ్యాలవాడలో దారుణం జరిగింది. కొనకలమిట్ల మండలం వాగుమడుగు గ్రామానికి చెందిన తాళ్ళూరి ఎబెల్​.. తనకు వరుసకు సోదరి అయిన మహిళపై కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం ఎబెల్ కు రూతమ్మతో వివాహం జరిగింది. ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రిత మళ్లీ గొడవపడ్డారు. రూతమ్మ పెద ఉయ్యాలవాడలోని తన పెద్దమ్మ కొడుకు ఇంటికి వెళ్లింది. అక్కడికీ వెళ్లిన ఎబెల్.. రూతమ్మతో మళ్లీ గొడవపడ్డాడు. అడ్డం వచ్చిన రూతమ్మ వదిన దివ్యభారతిపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. గాయపడిన దివ్యభారతిని హుటాహుటిన దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Last Updated : Jan 9, 2020, 4:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details