ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేతపై ప్రత్యర్థుల దాడి.. తీవ్రగాయాలు - prakasam

ఒంగోలు తెదేపా నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరరావుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెదేపా నేత

By

Published : Aug 24, 2019, 7:11 PM IST

ప్రత్యర్థుల దాడిలో తెదేపా నేతకు గాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరావుపై కొందరు దాడికి పాల్పడ్డారు. మరాఠీపాలెం వద్ద ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్న నాగేశ్వరావుని పది మంది యువకులు అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలైన బాధితుడిని స్థానికులు గమనించి నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తెదేపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకే తనపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని నాగేశ్వరావు ఆరోపించారు. ఇప్పటికీ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ...తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుండా.. తనపైనే ఎదురు కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details