మండల సమేవేశానికి ఆలస్యంగా వచ్చారంటూ ఏకంకా తహసీల్దార్ పైనే వైకాపా సర్పంచి దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. సర్వసభ్య సమావేశానికి అధికారులే ఆలస్యంగా వస్తే ప్రజాప్రతినిధులకు సమాధానం ఎవరు చెబుతారంటూ తహసీల్దార్ నాగార్జున రెడ్డిపై దాసరిపల్లి సర్పంచి చేయి చేసుకున్నాడు. తహసీల్దార్‌ను దుర్భాషలాడుతూ సర్పంచి చేయిచేసుకున్నాడు. తహసీల్దార్ సమావేశం భవనంలో కింద పడిపోయారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతవరణం నెలకొంది. పోలీసులు, కొందరు సభ్యులు జోక్యం చేసుకుని సర్పంచిని శాంతింపజేశారు. ఈ విషయమై తహసీల్దార్ న్యూస్ టుడేతో మాట్లాడుతూ.. తాను కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్‌లో ఉన్నందువల్ల ఆర్ఐని సమావేశానికి పంపానని చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమావేశానికి హాజరు కాగా తనపై దాసరిపల్లి సర్పంచి దౌర్జన్యం చేసి దాడి దిగారని చెప్పారు. గతంలో కూడా తన కార్యాలయానికి ఇదే తీరుగా వ్యవహరించారని.. కొన్ని ఫైళ్లపై బలవంతంగా సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. దాడి విషయాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
తహసీల్దార్‌పై వైకాపా సర్పంచ్ దాడి - mro attacked by sarpanch
ప్రకాశం జిల్లాలో తహసీల్దార్‌పై దాడి జరిగింది. మండల సమేవేశానికి ఆలస్యంగా వచ్చారంటూ ఏకంకా తహసీల్దర్ పైనే ఓ సర్పంచి దాడి చేశాడు.
తహసీల్దార్‌పై వైకాపా సర్పంచ్ దాడి