ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ATTACK ON LINEMAN: బిల్లు కట్టలేదు... కరెంట్ కట్ చేస్తే.. - ఏపీ 2021 వార్తలు

కరెంటు బిల్లు కట్టలేదని.. సరఫరా నిలిపివేసినందుకు లైన్‌మెన్​పైనే దాడికి దిగిందో కుటుంబం. విషయం తెలుసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా బొంతగంట్లలో చోటు చేసుకుంది.

attack-on-lineman-for-cutting-power-at-prakasham-district
బిల్లు కట్టలేరు.. కరెంట్ కట్ చేస్తే.. లైన్​మెన్​పై కర్రలతో దాడి!

By

Published : Nov 27, 2021, 11:54 AM IST

బిల్లు కట్టలేరు.. కరెంట్ కట్ చేస్తే.. లైన్​మెన్​పై కర్రలతో దాడి!

Attack on Lineman for cutting power: విద్యుత్ బకాయిలు చెల్లించలేదని.. కరెంట్ సరఫరా నిలిపివేసిన లైన్​మన్​పైనే ఓ కుటుంబం దాడికి దిగింది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం బొంతగుంట్లకు చెందిన కంచర్ల యోహాన్ 18 వందల రూపాయల విద్యుత్ బిల్లు బకాయి ఉన్నాడు. చెల్లించాలని విద్యుత్ అధికారులు చెప్పగా యోహాన్ ససేమిరా అన్నాడు. దీంతో లైన్​మన్ వారి ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఆగ్రహించిన యోహాన్ కుటుంబసభ్యులు లైన్​మన్ శివారెడ్డిపై దాడి చేశారు. అంతేకాక విద్యుత్ బిల్లులు కట్టించుకునేందుకు వచ్చిన విద్యుత్ సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారు. క్షతగాత్రుడు కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details