ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ సర్పంచిపై హత్యాయత్నం.. పాతకక్షలే కారణమా..? - attack on ex surpanch at markapur

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు మాజీ సర్పంచిపై హత్యాయత్నం జరిగింది. నిద్రిస్తున్న సమయంలో గంగయ్యపై దుండగులు కత్తితో దాడి చేశారు.

attack on ex sarpanch at prakasham district markapuram
attack on ex sarpanch at prakasham district markapuram

By

Published : Jun 21, 2021, 10:43 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు మాజీ సర్పంచిపై హత్యాయత్నం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గంగయ్యపై తెల్లవారుజామున దుండగులు కత్తితో దాడి చేశారు.ఈ ఘటనలో గంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితుల్లో.. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకువెళ్లారు. పాత కక్షలే దాడికి కారణమని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గంగయ్య గతంలో వేరొకరి వద్ద నగదు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకపోవడంతో వారు కోర్టుకెళ్లారు. ఈ విషయంలో గ్రామానికి చెందిన ఒకరు సాక్షిగా సంతకం పెట్టారు. సాక్షి సంతకం ఎందుకు పెట్టావని గంగయ్య అతన్ని నిలదీశాడు. ఈ క్రమంలో ఇటీవల ఇరువురి కుటుంబాల మధ్య వివాదం తలెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంగయ్యపై హత్యాయత్నం జరిగి ఉంటుందని కుటుంబసభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details