ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కొత్తూరులో ఓ యువకుడిపై దాడి జరిగింది. గ్రామంలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారని ఖాసిం అనే వ్యక్తి ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన నాటుసారా విక్రయదారుడు రసూల్... ఖాసింపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు అధికారులను ఆశ్రయించాడు. తనపై, తన కుటుంబంపై నాటుసారా తయారీ, విక్రయ దారులు దాడులకు పాల్పడుతున్నారని, వారి నుంచి రక్షించాలంటూ వేడుకున్నాడు.
సారా తయారీపై అధికారులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై దాడి - prakasam district crime news
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాటుసారా తయారీదారులు రెచ్చిపోతున్నారు. సారా తయారీపై అధికారులకు సమాచారం ఇచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా కొత్తూరులో ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు సారా అక్రమ తయారీ దారులు. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సారా తయారీపై అధికారులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి