Mahanadu: తెదేపా ప్రజల హృదయాల్లో ఉన్న పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రైవేటు కార్యక్రమాలకు ఇచ్చే విధానం ప్రకారమే మహానాడు సభకు స్టేడియం అద్దెకు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినా స్పందన లేదన్నారు. సీఎం కార్యాలయం ఆదేశాలతో తలొగ్గిన కలెక్టర్.. సభకు స్టేడియం ఇవ్వబోమని తమకు లేఖ రాశారన్నారు. మహానాడు సభకు తమ పొలం ఇస్తామని గ్రామస్తులు ముందుకొచ్చారని తెలిపారు.
తెదేపా.. ప్రజల హృదయాల్లో ఉన్న పార్టీ: అచ్చెన్న - మహానాడు న్యూస్
Atchennaidu: మహానాడు సభకు తమ పొలం ఇస్తామని ఒంగోలు సమీపంలోని గ్రామస్తులు ముందుకొచ్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు సభకు స్టేడియం అద్దెకు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినా స్పందన లేదన్నారు.
అచ్చెన్న
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈనెల 27, 28న నిర్వహించనున్న తెదేపా 40 ఏళ్ల పసుపు పండుగ మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను అచ్చెన్న పరిశీలించారు. సభా వేదిక, ఫోటో ఎగ్జిబిషన్, మీడియా , రక్తదాన శిబిరాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇవీ చూడండి