ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వెంగాయపాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న అశోక్ లేలాండ్, ద్విచక్రవాహనం ఢీ కొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పడమర వీరాయపాలేనికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ నుంచి మార్కాపురం వెళుతున్న అశోక్ లేలాండ్ సరకు రవాణా వాహనాన్ని.. కురిచేడు నుంచి పడమర వీరాయపాలెం వెళుతున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న బిక్కి పెద చౌడయ్య (28) అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
అశోక్ లేలాండ్, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి - రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వెంగాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న పడమర వీరాయపాలేనికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అశోక్ లైలాండ్, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరి మృతి