ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దగ్గుబాటి దడ పుట్టిస్తారా? ఏలూరి ఏలేస్తారా? - దగ్గుబాటి వెంకటేశ్వరరావు

ఒకరేమో... అధికార పార్టీ సిట్టింగ్​ ఎమ్మెల్యే... మరొకరేమో... అధికార పార్టీకి దగ్గరి బంధువు... పోటీ చేస్తోంది మాత్రం ప్రత్యర్థి పార్టీ నుంచి. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పోరు... కాక రేపుతోంది. సైకిల్ పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుస్తారా? అదే పార్టీ అధినేత చంద్రబాబుకు దగ్గరి బంధువు, వైకాపా తరఫున బరిలో దిగుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరావు... జెండా ఎగరేస్తారా? అని ఆసక్తి నెలకొంది.

దగ్గుబాటి దడ పుట్టిస్తారా? ఏలూరి ఏలేస్తారా?

By

Published : Mar 27, 2019, 9:02 AM IST

పర్చూరులో పాగా వేసేదెవరు
ప్రకాశం జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. ఏలూరి, దగ్గుబాటి మధ్య జరుగుతున్న పోటీతో...చూపు మెుత్తం పర్చూరు నియోజకవర్గం వైపే ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెదేపా అధిష్ఠానం టికెట్ కేటాయించగా...వైకాపా తరఫున ఎన్టీఆర్‌ పెద్దల్లుడు, ముఖ్యమంత్రి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీలో దిగారు. ఇరు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య విభేదాలు, అలకలు, అసంతృప్తులు ఉండనే ఉన్నాయి. వీటన్నింటిని నెట్టుకొని ఈ స్థానంలో ఎవరు విజయకేతనం ఎగరేస్తారోనన్న విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో 2 లక్షల 19 వేల 500 మంది ఓటర్లు ఉంటే. యుద్దనపూడి, పర్చూరు, మార్టూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోనివే. సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, దుగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక్కడి వారే. వెంకటేశ్వరరావుకు మెుదటి నుంచి ఇక్కడో వర్గం ఉంది. కొంతకాలంగా ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. చాలాకాలం తర్వాత ఈ ఎన్నికల్లో పర్చూరుపై దృష్టి పెట్టారు. మెుదట వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్​కు టిక్కెట్ ప్రయత్నాలు జరిగినా...అమెరికా పౌరసత్వం కారణంగా తండ్రే బరిలోకి దిగాల్సి వచ్చింది. నియోజకవర్గంతో ఉన్న సంబంధాలే గెలిపిస్తాయని ఆశతో ఉన్నారు దగ్గుబాటి. తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దూకుడుగా ఉంటారని ప్రచారం ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో కిందిస్థాయి నేతల మధ్య కొంత మనస్పర్థాలు ఏర్పడ్డాయి. సొంతపార్టీ నాయకుల మీద పోలీసు కేసులు, ఫిర్యాదులు వంటివి జరిగాయని అసంతృప్తికి కారణమయ్యాయి. వారిని బుజ్జగించి పనిలో ఉన్న ఆయన... ప్రచారం ముమ్మరం చేశారు. వైకాపా టికెట్ ఆశించిన రావి రామనాథం లాంటి వారి చేరికతో తెదేపా బలం పుంజుకుందని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలు, తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారని సాంబశివరావు ధీమాతో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details