Victor Prasad Comments: మహాత్మాగాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కుల మతాలకు అతీతుడైన జాతిపితపై ఇలాంటి మాటలు తగదన్నారు. యావత్ ప్రజానీకానికీ విక్టర్ ప్రసాద్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయన పదవికి రాజీనామా చేయాలన్నారు. గిద్దలూరు పట్టణంలోని ఆర్యవైశ్యులు గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. మహాత్మా గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విక్టర్ ప్రసాద్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్లకార్డులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. మండల తహసీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్‌కు వినతి పత్రం అందించారు.
మహాత్మా గాంధీపై.. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి - ఛైర్మన్
Victor Prasad: ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆర్య వైశ్య సంఘం తప్పుపట్టింది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. ప్రకాశం జిల్లాలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసనలకు దిగారు. ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆర్య వైశ్య సంఘం నిరసన
Last Updated : Oct 29, 2022, 12:49 PM IST