ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, కొత్తపల్లి గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వందకు పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు.
పట్టుబడ్డ నిందితులలో ఒకరు మహిళ కూడా ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. అక్రమ మద్యం తరలింపు, బెల్ట్ షాపుల నిర్వహణ, నాటుసారా అమ్మకాలు ఎవరైన చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 9121102188 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై రవీంద్రారెడ్డి తెలియజేశారు.