ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కూలీలను స్వగ్రామాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిరపకోతలకు కర్నూలు జిల్లా నుంచి పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, యద్ధనపూడి, మార్టూరు మండలాలలకు ఉపాధి కోసం వచ్చారు. లాక్డౌన్ నిబంధనతో వారందరూ అక్కడే చిక్కుకున్నారు. తాజాగా కేంద్రం వలస కూలీలపై మార్గదర్శకాలు జారీ చేయడంతో అధికారులు 219 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసి... 5,531 మంది కూలీలను స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బస్సులన్నింటిని హైపో క్లొరైడ్ ద్రావణంతో శుభ్రపరిచారు. బస్సుల్లో కూలీలకు కావలసిన ఆహారం, తాగునీటిని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి - ప్రకాశం జిల్లా నేటి వార్తలు
కరోనా లాక్డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా పర్చూరులో చిక్కుకున్న కర్నూలు జిల్లా కూలీలను అధికారులు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. తమ స్వగ్రామాలకు వెళుతుండటంపై కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.
వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి