ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Mahanadu : తెలుగుదేశం మహానాడుకు జోరుగా ఏర్పాట్లు.. రెండేళ్ల తర్వాత..

తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. కరోనా దెబ్బకు రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో వేడుక జరగ్గా... ఈసారి ఒంగోలులో కార్యకర్తలు, ప్రజల సమక్షంలోనే నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇదే వేదికపై ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం ఏర్పాటుచేయడంతో... మహానాడు మరింత ప్రత్యేకత సంతరించుకోనుంది.

TDP
TDP

By

Published : May 21, 2022, 5:47 AM IST

ఒంగోలుకు సమీపంలోని మండవవారిపాలెం వద్ద మహానాడు నిర్వహణకు తెలుగుదేశం భారీ ఏర్పాట్లు చేస్తోంది. నందమూరి తారకరాముడి జయంతిని పురస్కరించుకుని ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ కార్యక్రమం ఆన్‌లైన్‌ ద్వారానే జరుపుతుండగా.... ఈసారి కార్యకర్తల సమక్షంలో నిర్వహించనున్నారు. పసుపు పండుగ కోసం వేదికతోపాటు నాయకులు, కార్యకర్తలు కూర్చుకోవడం, ఇతర అవసరాల కోసం 80 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఆనుకుని మరో 40 ఎకరాల స్థలాన్ని వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. తొలిరోజు మే 27న 10 వేల మందితో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.

తెలుగుదేశం మహానాడుకు జోరుగా ఏర్పాట్లు.. రెండేళ్ల తర్వాత..

రెండోరోజు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. దాదాపు లక్ష మంది అభిమానుల మధ్య భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలులోని హోటళ్లు, లాడ్జిలు, కల్యాణ మండపాలు ఇప్పటికే అద్దెకు తీసుకున్నారు. పక్క జిల్లాలు, సమీప పట్టణాల్లో కూడా వసతి సౌకర్యాల ఏర్పాటు చేస్తున్నారు.

మహానాడు ఏర్పాట్లను మాజీ మంత్రి కొల్లురవీంద్ర, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పరిశీలించారు. ఎండ ఎక్కువగా ఉన్నందున ప్రాంగణమంతా నీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలు సజావుగా సాగేందుకు కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు నేతలు తెలిపారు.

మహానాడుకు భారీ జనసమీకరణకు చేయాలని నిర్ణయించిన తెలుగుదేశం... ఆమేరకు ప్రణాళికలు అమలు చేస్తోంది. పసుపు పండుగకు హాజరుకావాలంటూ ఒంగోలులో ఇంటింటికీ తిరుగుతూ... మహిళా ప్రతినిధులు ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చదవండి:తెదేపా మహానాడుకు 16 కమిటీలు.. ఏర్పాటు చేసిన అధినేత చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details