ARMY SOLDIERS DIED: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు ఆర్మీ ఉద్యోగులలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. ఆర్మీ ఉద్యోగులైన కర్నాటి రామచంద్రారెడ్డి (26) మార్తల శివారెడ్డి (27) ఈతకు వెళ్లారు. నీటిలో ఈత కొడుతుండగా రామచంద్రారెడ్డి మృతి చెందగా, శివారెడ్డి గల్లంతయ్యాడు. గల్లంతైన శివారెడ్డి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శివారెడ్డి పంజాబ్లో విధులు నిర్వహిస్తుండగా.. రామచంద్రారెడ్డి సిక్కింలో పని చేస్తున్నాడు. సెలవులపై వచ్చినవారు మృత్యువాత పడటంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈత సరదా.. రెండు కుటుంబాల్లో విషాదం - Soldiers who went swimming died
ARMY SOLDIERS DIED: ఇద్దరూ స్నేహితులు. వాళ్లిద్దరిదీ ఒకే గ్రామం. ఆర్మీలో ఉద్యోగులు. ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. సెలవులపై గ్రామానికి వచ్చారు. సరదాగా గడపాలనుకున్నారు. ఈతకు వెళ్లారు. కానీ కాలం వారిపై కన్నేసింది. ఈత సరదా వారి కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈతకు వెళ్లిన వారిలో ఒకరు మరణించగా.. మరొకరు గల్లంతయ్యారు.

army soldiers died