ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చేపల సాగుకు కోళ్ల వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు' - ప్రకాశం జిల్లాలో చేపల చేరువులపై మత్స్యశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం జిల్లా అనమలమూరులో మత్య్సశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 80 ఎకరాల్లో సాగు చేస్తున్న చేపల చెరువులను పరిశీలించారు. చేపల సాగులో కోళ్ల వ్యర్థాలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు.

Archeology department officers checkings at Anamalamuru fish ponds in prkasham district
'చేపలకు కోళ్ల వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలే'

By

Published : Mar 4, 2020, 6:18 PM IST

'చేపలకు కోళ్ల వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలే'

చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలను.. చేపల చెరువుల్లో వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్య శాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం అనమలమూరులో సాగుచేస్తున్న చేపల చెరువులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో 80 ఎకరాల్లో వీటిని చేపడుతున్నారు. మూడు, నాలుగు మినహా మిగిలిన వాటిలో నిబంధనలకు విరుద్ధంగా కోడి వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నట్టు గుర్తించారు.

పైగా.. అనమలమురులో చేపల చెరువుల సాగుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోళ్ల వ్యర్థాలను చెరువులకు తరలించే వాహనాల వివరాలను సేకరించామని.. రవాణా శాఖ అధికారుల సాయంతో వాటిని సీజ్‌ చేస్తామని జేడీ తెలిపారు. చెరువుల నిర్వాహకులు, భూ యజమానులకు త్వరలోనే నోటీసులు అందిస్తామన్నారు. పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details