ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనం తగిలి కూలిన దేవాలయం ఆర్చ్ - ప్రకాశం జిల్లా నేటి వార్తలు

భారీ వాహనం తగిలి దేవాలయం ఆర్చ్ కూలిపోయిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జరిగింది. ఈ ఘటనపై వాహనదారుడిని స్థానికులు అడ్డుకోగా... ఆర్చ్​ను తిరిగి నిర్మిస్తామని సంబంధిత గుత్తేదారు హామీ ఇచ్చారు.

arch destroyed in with vehicle accident in  prakasam district
వాహనం ఢీకొని కూలిన దేవాలయ రహదారి ద్వారం

By

Published : Oct 15, 2020, 10:33 PM IST

ప్రకాశం జిల్లాలోని విజయవాడ - చెన్నై మార్గంలో రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వేటపాలెం మండలం రావురిపేటలోని కనక నాగ వరపమ్మ దేవస్థానానికి వెళ్లే దారిలో ఉన్న ఆర్చ్​ను రైల్వే సామాన్లు తరలించే వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్చ్ పూర్తిగా కూలిపోయింది. ఆసమయంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంపై వాహనదారుడిని స్థానికులు నిలదీయటంతో దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారాన్ని పునర్నిర్మిస్తామని గుత్తేదారు హామీఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details