రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి.. 50 లక్షల బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వాక్సిన్ ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకోకపోగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా మీడియా సంస్థలపై కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదు లక్షల సాయం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా.. ఇంత వరకూ పూర్తి స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు.
'ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని కూడా అమలు చేయరా..?' - CM Promises to Journalists news
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని... కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్‌కు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు బహిరంగ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద లేఖ విడుదల చేసిన సుబ్బారావు.. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
!['ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని కూడా అమలు చేయరా..?' APWUJ Demands CM Promises to Journalists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11804944-1034-11804944-1621333185717.jpg)
సెకండ్ వేవ్‌లో మరో 70 మందికిపైగా జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిన సమాచార శాఖ మంత్రి ఎక్కడున్నారో ఎవరికి తెలియదని సుబ్బారావు పేర్కొన్నారు. జర్నలిస్టులకు సీఎం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఉన్న అన్నీ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల