ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే రాష్ట్రానికి ​తీవ్ర అన్యాయం' - ఒంగోలు తాజా వార్తలు

ఉద్యోగ, కార్మిక సంఘాలతో కలిసి పోరాడతామని.. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని ఆయన కోరారు.

apngo president on visakha steel plant
ఏపీ ఎన్.జీ.ఓ అధ్యక్షుడు

By

Published : Mar 22, 2021, 8:12 PM IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్​ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని ఏపీ ఎన్​జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన ఆయన ప్రెస్​క్లబ్​లో విలేకర్లతో మాట్లాడారు.

ఎంతో మంది ప్రాణాల త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ఉద్యోగ, కార్మిక సంఘాలతో కలిసి కాపాడుకుంటామన్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరిస్తే రాష్ట్రానికి​ తీవ్ర అన్యాయానికి జరుగుతుందని ఆయన అన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details