ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీవో నేతల ఆందోళన - ప్రకాశం తాజా సమాచారం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీవో నేతలు ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒంగోలు కాలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీవో నేతల ఆందోళన
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీవో నేతలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.