ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బలహీన వర్గాల ప్రజలపై దాడులు జరుగుతుంటే సీఎంకు పట్టదా..?: శైలజానాథ్ - ప్రకాశం జిల్లా వార్తలు

రాష్ట్రాలో ఇటీవల ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులను నిరసిస్తూ ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆందోళన చేపట్టారు. బలహీన వర్గాలకు,పేదలకు జీవించే హక్కు లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ మైనారిటీ సెల్‌కు ఛైర్మన్​గా వ్యవహరించే సీఎం.. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

apcc president sailajanath
apcc president sailajanath

By

Published : Jul 25, 2020, 9:24 PM IST

బలహీన వర్గాల ప్రజలపై వైకాపా ప్రభుత్వం నిత్యం దాడులు, కక్ష సాధింపు చర్యలతో.. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో పలు జిల్లాల్లో బలహీన వర్గాలపై జరిగిన దాడులకు నిరసనగా..ప్రకాశంజిల్లా కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బలహీన వర్గాలకు,పేదలకు జీవించే హక్కు లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ మైనారిటీ సెల్‌కు ఛైర్మన్​గా వ్యవహరించే ముఖ్యమంత్రి.. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. దాడులకు అధికారులు, అధికార పక్షనాయకులు కీలకంగా వ్యవహరిస్తుండటం దారుణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details