- నటశేఖరుడికి ఇక సెలవు.. అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్
సినీ దిగ్గజం, సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వందలమంది అభిమానులు, చలనచిత్ర ప్రముఖులు తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముఖ్యమంత్రి జగన్.. దావూద్ ఇబ్రహీంను మించిపోయారు:చంద్రబాబు
CHANDRABABU TOUR : తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. జగన్ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని నమ్మి.. ప్రజలు మోసపోయారని తెలిపారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన దేవనకొండలో రోడ్ షో నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోలవరంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు, అంగీకరించలేదు: శశిభూషణ్‌కుమార్
Polavaram Project Authority Meeting: పోలవరం దిగువ కాఫర్ డ్యాం పనులు జనవరి నెల చివరికల్లా పూర్తి చేస్తామని జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని కృష్ణా గోదావరి భవన్‌లో .. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన భేటీలో ఆయన పాల్గొన్నారు. పోలవరం పనుల లక్ష్యాలు, వనరులపై చర్చించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట.. ఇంటి వద్దే విచారణకు ఆదేశం
HIGH COURT ON EX MINISTER NARAYANA : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మాజీమంత్రి నారాయణపై సీఐడి కేసు నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెరుచుకున్న శబరిమల ఆలయం.. 41రోజుల పాటు మండల పూజ.. భారీగా భక్తుల తాకిడి!
శబరిమల ఆలయం మండల పూజ కోసం తెరుచుకుంది. తొలిరోజే భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఆన్లైన్, స్పాట్ బుకింగ్ ఉన్నవారికే దర్శనానికి అనుమతిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో శ్రద్ధా వాకర్ తరహా ఘటన.. ప్రియురాలిని హత్య చేసి మృతదేహంతో వీడియో!
ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ ప్రియుడు. ఈ కిరాతక ఘటన నవంబర్ 8న మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని ఓ రిసార్ట్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీ మాటకు జైకొట్టిన 'జీ20'.. యుద్ధం ఆపాలని రష్యాకు పిలుపు
ప్రస్తుత యుగం యుద్ధాలకు కాదని జీ20 దేశాలు ఉద్ఘాటించాయి. యుద్ధాన్ని ఆపాలని రష్యాకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిబింబించేలా ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రీలాంచ్‌కు సిద్ధమైన బ్లూటిక్.. భారత్‌లో ట్విట్టర్ చాలా స్లో!
ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ సేవల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో నవంబర్ 29నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మస్క్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ODI Worldcup: 'నాన్సెన్స్.. టీమ్ఇండియాకు అంత సత్తా లేదు'
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా గెలవలేదని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. ఇంగ్లాండే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాధలోనూ ఫ్యాన్స్‌పై ప్రేమ చూపించిన మహేశ్
తమ అభిమాన నటుడు కృష్ణను కడసారి చూసేందుకు దూర ప్రాంతాల నుంచి అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా మహేశ్ బాబు తగిన ఏర్పాట్లు చేశారు. ఎవరూ ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీ ప్రధాన వార్తలు