''పొగాకు రైతులను ఆదుకుంటాం.. ఆందోళన వద్దు'' - tobaco farmers
పొగాకు రైతులకు అన్ని వసతులు సమకూరుస్తామని బోర్డు చైర్ పర్సన్ సునీత చెప్పారు. సంతనూతలపాడులో పర్యటించిన ఆమె... రైతులు ఆందోళన పడొద్దని కోరారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో జరుగుతున్న పొగాకు వేలాన్ని... బోర్డు చైర్ పర్సన్ సునీత పరిశీలించారు. ఈ ఏడాది రైతులకు సరిపడా నీరు అందక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. వర్షాలు సకాలంలో కురిస్తే పంట దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులందరికీ స్ప్రేయర్లు అందిస్తామన్నారు. తమకు మద్దతు ధర రాక.. ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులు భరోసా ఇచ్చారు.