వెంకటేశుడి బ్రహ్మోత్సవాలు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం మల్లవరం గుండ్లకమ్మ చెంత కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారిని విశేష పూలతో సుందరంగా అలంకరించి.. పూజా కార్యక్రమాలు చేయనున్నారు. పుర వీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 20న తితిదే ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం, అదే రోజు సాయంత్రం గుండ్లకమ్మ జలాశయంలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.