ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 4 తర్వాత క్రమేణా మేఘాలు చల్ల బడ్డాయి. చిరు జల్లులతో ప్రారంభమై ఈదురు గాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎర్రగొండపాలెం, కంభం మండలాల్లో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. తీవ్ర ఎండ తాపానికి గురైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
ప్రకాశంలో వడగండ్ల వాన- చల్లబడిన వాతావరణం - undefined
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పగలు ఎండ వేడికి గురైన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
![ప్రకాశంలో వడగండ్ల వాన- చల్లబడిన వాతావరణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3042324-thumbnail-3x2-ong.jpg)
ప్రకాశం జిల్లాలో వడగండ్ల వర్షం