ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పోలీసులు కర్ఫ్యూ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత రోడ్లపైకి వచ్చిన 78 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను సీజు చేశారు. వాహనదారులకు ఏఎస్పీ రవిచంద్ర, డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయాల్లో తప్ప మిగతావేళల్లో బయటకురాకూడదని, నిబంధనలు ఉల్లంగిస్తే వాహనాలు జప్తు చేయటంతో పాటు కేసులు నమోదుచేస్తామన్నారు. జప్తు చేసిన వాహనాలను కర్ఫ్యూ అనంతరం జరిమానా విధించి విడిచిపెడతామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
కర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠినం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు
కరోనా కల్లోలం రేపుతోంది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంగించి అనవసరంగా రహదార్లపై తిరిగే వాహనాలను జప్తు చేస్తామని చీరాలలో ఆదనపు ఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. కర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠినతరం చేశామన్నారు.
cases in chirala