ప్రకాశం జిల్లా.. గిద్దలూరు మండలం, మొడంపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రవీందర్ రెడ్డికి అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేశారు. వాహనంలో తరలిస్తున్న 45 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని గిద్దలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గిద్దలూరులో పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
![అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత ration rice](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:29:27:1620187167-ap-ong-22-05-rationricepattiveta-avb-ap10135-05052021092533-0505f-1620186933-545.jpg)
ration rice