ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో మట్టి మాటున చెరువులను పెకలించి ఇసుకను కాజేస్తున్నారు అక్రమార్కులు. చెరువులో 5 అడుగుల లోతులో ఉన్న ఇసుకను తవ్వి లోపల పొరలో దొరికే నాణ్యమైన ఇసుకను ట్రాక్టర్లలో నింపి దోచుకుపోతున్నారు. ఇప్పటివరకు మట్టి మాఫియా.. స్థానిక నాగుల చెరువు, పెద్ద చెరువులలో మట్టిని అనధికారికంగా తరలించి లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా చెరువు అడుగున ఉన్న ఇసుక పై వారి కన్ను పడింది. వాస్తవంగా తవ్వకాలు జరపాలంటే రెవెన్యూ , గనుల శాఖాధికారుల అనుమతి ఉండాలి.
ఇసుక మాఫియా.. మట్టిమాటున నాణ్యమైన ఇసుక స్వాహా - ప్రకాశం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలింపు
ఇసుక మాఫియా అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతోంది. అక్రమంగా చెరువుల్లోంచి ఇసుకను కాజేస్తోంది. ప్రకాసం జిల్లాలో ఉన్న పెద్ద చెరువులలోని మట్టిని అనధికారికంగా తొలగిస్తూ నాణ్యమైన ఇసుకను ఎత్తుకుపోతున్నారు.
కానీ అవేమీ పట్టకుండా కొన్ని నెలలుగా రోజుకు సుమారు 50 నుంచి 100 ట్రక్కుల వరకు.. ఒక్కో ట్రక్కుకు సుమారు 4వేల నుంచి 5 వేల వరకు ఇసుకను అమ్ముతున్నారు. చెరువు మొత్తం గుంతలు తీసి చెరువు అడుగున ఉన్న ఇసుక యథేచ్ఛగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న కనిగిరి ఎమ్మార్వో నాగుల చెరువును పరిశీలించి ఇసుకను తరలిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:అత్యధిక క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్