ప్రకాశం జిల్లా కనిగిరిలోని గార్లపేట రోడ్డులో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు వినతిపత్రం అందించారు. పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రధాన రహదారి నుంచి స్కూల్ వరకు సుమారు ఒకటిన్నర కిలో మీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంది. వానాకాలంలో వరద నీటితో దారంతా గుంటలు, బురదతో నిండిపోయి..నడిచేందుకు వీలులేకుండా ఉంటుందని చెప్పారు.
సమస్యలు తీర్చాలంటూ ఎమ్మెల్యేకు విద్యార్థులు వినతిపత్రం - ap model school in kanigiri news
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం అందించారు. పాఠశాలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన విద్యార్థులు
తాగునీటి సదుపాయం లేకపోవటంతో ఇంటి దగ్గర నుంచి మంచినీళ్లు తీసుకెళ్తున్నామని అన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. కనిగిరి మున్సిపల్ కమిషనర్‌కి ఫోన్ చేసి యుద్ధ ప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. వచ్చే నెల చివరి నాటికి తారు రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: కోడిగుడ్లా... మరేదైనా పక్షి గుడ్లా..!