ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంట విక్రయానికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు' - ap farmers difficulties in lock down

రైతల పంట విక్రయానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా అన్నంబోట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

ap high court questions on farmers product marketing
పంట విక్రాయాలపై హైకోర్టు

By

Published : Apr 17, 2020, 12:06 AM IST

రైతుల పంట ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో.. ఎలాంటి వైఖరి అనుసరిస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా అన్నంబోట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ . . త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉన్న అరటి , మామిడి , టమాట , పుచ్చ తదితర ఉత్పత్తులను తక్షణమే మార్కెట్‌కు పంపాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పండించిన పంటను మార్కెట్లకు పంపే సదుపాయాల్ని ప్రభుత్వం కల్పించాల్సి ఉందన్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ విధానం ద్వారా పంట విక్రయ వెసులుబాటు కల్పించాలన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ప్రభుత్వ వైఖరి తెలుసుకోవడం కోసం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details