హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ హైకోర్టులో వాజ్యం దాఖలైంది. పిటిషన్ వేయగానే స్థానిక కోర్టులో పోలీసులు ఇద్దరిని హాజరుపరిచారని పిటీషనర్ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ధర్మాసనం అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి వివరాలు రాబట్టాలనుకుంటే కోర్టులో హాజరుపరిచి పోలీసు కస్టడీకి తీసుకోవచ్చు కదా అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. దీనిపై రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. పలు హెబియస్ కార్పస్ పిటీషన్లను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ - హెబియస్ కార్పస్ పిటిషన్ న్యూస్
ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ వాజ్యం దాఖలైంది. ఈ విషయంపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం... రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ