ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంపు - కానిస్టేబుల్‌ పోస్టులు

Age Relaxation for police constable jobs: కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితిని రెండు సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత అక్టోబర్​ 20న విడుదలైన నోటిఫికేషన్​లో ఉద్యోగార్థుల వయోపరిమితిని పెంచలేదు. వయోపరిమితి పెంచకపోవడంతో ఆయా అభ్యర్థులతో పాటుగా.. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం దిగివచ్చింది. వయోపరిమింతిని రెండు సంవత్సరాలకు పెంచినట్లు తెలిపింది.

రెండేళ్ల సడలింపు
police constable jobs

By

Published : Dec 23, 2022, 3:58 PM IST

Age Relaxation for police constable jobs: గత ఆరు సంవత్సరాల కాలంగా నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం పచ్చజెడా ఊపింది. కానీ, వయోపరిమితి విషయంలో మాత్రం ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా నోటిఫికేషన్​ విడుదల చేసింది. కొవిడ్​తో పాటుగా.. ప్రభుత్వ నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో చాలా మంది అభ్యర్ధులు పోలీసు ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలిపోయారు. అభ్యర్థులు గత ఆరేళ్లుగా సాధన చేస్తున్నారు. తాజా నోటిఫికేషన్​తో తాము అనర్హులుగా మారామని అభ్యర్థులతో పాటుగా.. విద్యార్ధి సంఘాలు ఉద్యమం చేపట్టాయి. వారంతా కలిసి గత కొన్నిరోజులుగా ప్రభుత్వానికి వినతులు ఇస్తూనే వివిధ రాజకీయ పక్షాలుతో కలిసి వయోపరిమితి విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో ప్రభుత్వం దిగివచ్చింది. రెండుసంవత్సరాల వయోపరిమితిని సడలిస్తున్నట్లు వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం రెండేళ్ల వయోపరిమితిని సడలించడంతో ఉద్యోగార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది.

కాగా.. పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం పోలీస్‌శాఖ అక్టోబరు 20న నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో 6,100 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. కానీ రెడు సంవత్సరాల వయోపరిమితి తక్కువే అంటూ ఐదు సంవత్సరాలకు పెంచాలని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదంవడి:

ABOUT THE AUTHOR

...view details