ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద నాన్ మేజర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. విభజన చట్టం ప్రకారం పోర్టు నిర్మాణంపై కేంద్రానికి డీపీఆర్ సమర్పించడంలో.. గతంలో జరిగిన జాప్యంతో నిర్మాణం ఆలస్యమైంది. దుగరాజపట్నం వద్ద నిర్మాణ వ్యయం ఎక్కువవడంతోపాటు, నిర్వహణ కూడా కష్టమన్న అంచనాతో ప్రభుత్వం రామాయపట్నాన్ని ఎంపిక చేసింది. కేంద్రం కూడా పచ్చజెండా ఊపడంతో... తాజాగా సమగ్ర నివేదిక రూప కల్పనకు సిద్ధమైంది. ప్రస్తుతం పోర్టు నిర్మాణానికి డీపీఆర్‌ను దిల్లీలోని రైట్స్ సంస్థ సిద్ధం చేస్తోంది.
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు!
ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను సంబంధిత నిపుణులకు అప్పజెప్పారు. ఓడరేవును గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఇప్పటికే కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. నిర్మాణం పూర్తయితే వాణిజ్యంగా కలిగే మేలుపై ప్రభుత్వం భారీ ఆశలే పెట్టుకుంది.
ap-government-ready-to-build-ramayapatnam-port