కేంద్ర ప్రభుత్వ పథకం 'హర్ ఖేత్ కో పానీ(ప్రతి పొలానికి నీరు)'ని ప్రకాశం జిల్లాలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 69.74 కోట్ల రూపాయలతో ఈ పథకం అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నిధులను ప్రపంచ బ్యాంకు సమకూరుస్తుంది. జిల్లాలోని మొత్తం 97 నీటి వనరులని ఈ పథకంలో అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈమేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.