ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"మాకొద్దు బాబో య్ ఈ భోజనం" - EKTHASAKTHI FOOD IS VERY BAD IN SCHOOLS AT PRAKASHAM DISTRICT

నాణ్యత లేని భోజనం సరఫరాతో విద్యార్థులు పస్తులుంటున్నారు. ఓ సంస్థ ద్వారా ఇచ్చే ఆహారం బాగాలేదంటూ తినటం మానేస్తున్నారు. ఇది ఒకటో రెండో పాఠశాలల సమస్య కాదు... రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లోనూ వినిపిస్తున్న మాట.

EKTHASAKTHI FOOD IS VERY BAD IN SCHOOLS
ఈనాడు కథనంతో కదలిక

By

Published : Jan 1, 2020, 10:27 AM IST

మొన్నటి వరకు కుకింగ్ ఏజెన్సీల ద్వారా పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్నా భోజనం వండి విద్యార్థులకు వడ్డించేవారు. ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ బాధ్యతలను ఏక్తా శక్తి అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి... అక్కడి నుంచే 25 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తుంది. ఈ నెల 3 నుంచి కార్యాచరణ అమల్లోకి వచ్చింది.
బోధనంపాడు జిల్లాపరిషత్‌ పాఠశాలకు పంపిన భోజనం చేదుగా ఉందని ప్రధానోపాధ్యాయుడు వెనక్కి పంపేశారు. ఈ చర్యతో 350 మంది విద్యార్థులు ఆకలితో పస్తులు ఉండాల్సి వచ్చింది. అదే ఆహారాన్ని సర్దుకుపోయి తిన్న పిల్లలు వాంతులు చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఇది ఒక్క బోధనంపాడు సమస్యకాదని... రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందంటున్నారు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు.
ఈ దుస్థితిపైనే ఈనాడు పత్రికలో "మాకొద్దు బాబోయ్ ఈ భోజనం" కథనం ప్రసారమైంది. స్పందించిన సిబ్బంది కాస్త నాణ్యమైన భోజనం సరఫరా చేసినట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు. ఇంకా మంచిగా ఆహారం అందివ్వాలని కోరుతున్నారు.

"మాకొద్దు బాబో య్ ఈ భోజనం"

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details