ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హైకోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలకు వెళతాం' - ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు అప్​డేట్స్

ap-employees
ap-employees

By

Published : Jan 21, 2021, 1:19 PM IST

Updated : Jan 21, 2021, 7:09 PM IST

13:12 January 21

హైకోర్టు తీర్పుపై మంత్రి వ్యాఖ్యలు

"ఎన్నికలు భయపడి స్థానిక ఎన్నికలను వాయిదా కోరడం లేదు. ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం.. రాజకీయాలు కాదు.. హైకోర్టు బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలకు వెళతాం" అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి విశ్వరూప్‌ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా సిద్దమే అన్నారు. కానీ.. ప్రస్థుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు అంత అనుకూలమైన వాతావరణం లేదని చెప్పారు. కోవిడ్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ఇంత పట్టుదల సరికాదు: మంత్రి కన్నబాబు

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని.. మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అయితే కరోనా సమయంలో ఉద్యోగుల ఆందోళన చెందుతున్నా.. ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదల మాత్రం సరికాదన్నారు. కమిషన్‌ ఆలోచన వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు.

పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం..

             పంచాయతీ ఎన్నికలు నిర్వహించు కోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని మంత్రులు ఆదిమూలపు సురేశ్, అంజద్ బాషా అన్నారు. కడప నగరంలో రేషన్ బియ్యం పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.  కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు విన్నవించినా.. ఆయన ఎన్నికలు నిర్వహించడానికి  షెడ్యూల్ విడుదల చేశారన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం షెడ్యూల్ విడుదల చేశారో అర్థం అవుతోందని ఆదిమూలపు సురేశ్​ వ్యాఖ్యానించారు.  

              పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైకాపా ఘన విజయం సాధిస్తుందన్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా..  కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఉద్యోగుల క్షేమం కోసం వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అంజద్​ బాషా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై.. తుది నిర్ణయం ఎస్‌ఈసీదే: హైకోర్టు

Last Updated : Jan 21, 2021, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details