ఆ గ్రామంలో పదో తరగతి చదవింది ఒకే ఒక్కడు ప్రకాశం జిల్లా పొదిలి మండలం తల్లమళ్ల గ్రామపంచాయతీ పరిధిలోనిది ఫిరదౌస్ నగర్లో సుమారు 80 కుటుంబాలు నివసిస్తుంటారు. ఈ గ్రామస్థులంతా రాళ్లు కొట్టుకుని జీవనం సాగిస్తుంటారు. 1998లో ఈ గ్రామంలో ఐదో తరగతి వరకు ప్రభుత్వం పాఠశాలను ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ఫిరదౌస్నగర్ వాసులు పిల్లలను బడులకు పంపేవారు. పై చదువులు చదివించాలంటే 3 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలపాడు హైస్కూల్‌కి పంపాల్సి ఉంటుంది. దీనికి ఇష్టపడని గ్రామస్థులు ... తమ పిల్లలను ఐదో తరగతి పూర్తి చేసిన వెంటనే పనుల్లోకి దింపేవారు. దీని కారణంగా ఆ గ్రామంలో ఒక్కరు కూడా పదో తరగతి పూర్తి చేయలేదు. 2012లో ఫిరదౌస్ నగర్ స్కూల్‌కి ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన శ్రీనివాసరెడ్డి... గ్రామస్థులకు చదువుపై అవగాహన కల్పించారు. పిల్లలను హైస్కూల్ కు పంపించడానికి ఒప్పించారు. ఫలితంగా 2018-19 విద్యా సంవత్సరంలో గ్రామానికి చెందిన రసూల్ బాషా 7.8 జీపీఏతో పదో తరగతి పూర్తి చేశాడు.