ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటనపై పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు. దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలోని బృందం గ్రామంలో మద్యానికి బానిసైన వారిని విచారిస్తోంది. ఇప్పటివరకు 37మంది అనుమానితులను గుర్తించి వారి.. పరిస్థితులను పరిశీలించి ముందు జాగ్రత్త చర్యలో బాగంగా మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
శానిటైజర్ తాగారని మరో 37 మంది ఒంగోలు రిమ్స్‌కు తరలింపు - శానిటైజర్ తాగిన ఘటనలో మరో 37 మంది గుర్తింపు న్యూస్
ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగిన మరి కొంతమందిని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే శానిటైజర్ తాగిన ఘటనలో 14 మంది బలయ్యారు.
శానిటైజర్ తాగారని మరో 37 మంది ఒంగోలు రిమ్స్‌కు తరలింపు
ఇప్పటికే.. మద్యానికి బానిసైన వ్యసనపరులు మందు దొరక్క శానిటైజర్ తాగిన ఘటనలో 14 మంది మృతి చెందారు. కురిచేడులో శానిటైజర్ తాగి 11 మంది మృతి చెందగా...పామూరులో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఇదీ చదవండి: ప్రకాశం: శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
Last Updated : Aug 1, 2020, 10:44 PM IST