ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో... ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఒంగోలు డైరీని కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి బదలాయించి, డైరీని ఆదుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. డైరీ రూ.56 కోట్ల అప్పుల్లో ఉందని, పొదుపు చర్యలతో పాటు... కొన్ని నిర్ణయాలు వల్ల దీన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా సంయుక్త పాలనాధికారి షన్మోహన్ పేర్కొన్నారు. పాల కేంద్రాలకు, రైతులకు పాత బకాయిలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ డైరీలు ఇచ్చే ధర లీటర్ పాలు రూ.57 నుంచి రూ.60కి పెంచాలని పలువురు డైరక్టర్లు, రైతులు డిమాండ్ చేశారు.
ఒంగోలు డైరీ... కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి - ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం
ఒంగోలులో ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఒంగోలు డైరీని కంపెనీ చట్టం నుంచి... సహకార చట్టంలోకి బదలాయించి ఆదుకుంటామని కమిటీ తెలిపింది.
సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్లు