Anna Canteen: ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి.. తన సొంత స్థలంలో సుమారు 20 లక్షలు రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకుడు జనార్దన్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రతి రోజు 5వందల మందికి పైగా అన్న క్యాంటీన్లో భోజనం అందిస్తామనిఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అన్న క్యాంటీన్‌ను నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తమ లక్ష్యమన్నారు.
పేదల ఆకలి తీర్చేందుకు.. కనిగిరిలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభం - పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్
Anna Canteen: నిరుపేదలకు 5రూపాయలకే నాణ్యమైన భోజనం, అల్పాహారం అందించే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వాటిని తొలగించింది. ఆ క్రమంలోనే కనిగిరిలోనూ అన్న క్యాంటీన్ ని తొలగించి...ఆ భవనంలో సచివాలయం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పేదలు పట్టెడన్నం కోసం పడుతున్న పరిస్థితిని దృషిలో ఉంచుకొని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు వీటిని ఏర్పాటుచేసి సొంతంగా పేదలకు భోజనం అందిస్తున్నారు. అదే స్ఫూర్తితో కనిగిరిలో అన్న క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభించారు.
anna cantin reopen in kanigiri
అన్న క్యాంటీన్ నిర్వహణకు నియోజకవర్గ టీడీపీ నాయకులకు గత పది రోజుల వ్యవధిలో స్వచ్ఛందంగా 15 లక్షల రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి. కనిగిరికి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త నీలిశెట్టి సుబ్బారావు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటూ.. కనిగిరిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌కు 5 లక్షల రూపాయల విరాళాన్ని అందచేశారు. చాలాకాలంగా అన్న క్యాంటీన్ మూసివేయగా నేడు మరల ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నామని స్థానికులు అంటున్నారు.
ఇవీ చదవండి
Last Updated : Jan 6, 2023, 10:39 PM IST