గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా తీసుకున్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. పాదయాత్ర సమయంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. 20 సంవత్సరాలకు పైగా ఏఎన్ఎంలుగా ఉన్న తమను ఇప్పుడు తీసివేయాలనుకోవడం సరికాదన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఎన్ఎంల ధర్నా - కలెక్టరేట్
గ్రామ సచివాలయంలో తమను ఉద్యోగులుగా తీసుకున్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.
ఏఎన్ఎంల ధర్నా