ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తకు కరోనా పరీక్షలు నిర్వహించగా... పాటిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. సదరు ఎఎన్ఎం ప్రతిరోజు చిలకలూరుపేట నుంచి విధులకు హాజరవుతున్నారు. ఇటీవలే ఆమె నివాసముండే ప్రదేశానికి సమీపంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఎఎన్‌ఎంను వైద్యాధికారులు గత 14 రోజులుగా హోమ్ క్వారంటైన్లో ఉంచారు. సదరు మహిళా ఉద్యోగికి చేసిన పరీక్షా ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల గురువారం యథావిథిగా విధులకు హాజరయ్యారు.
సచివాలయంలో ఏఎన్ఎంకు కరోనా పాజిటివ్ - martur mandal latest corona news
నాగరాజుపల్లి గ్రామ సచివాలయంలోని ఏఎన్ఎంకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ ఉద్యోగితో ఉన్న మరో 15 మందిని ఇంకొల్లులోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఎఎన్ఎం చిలకలూరుపేట నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామ శివారులో చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలెవ్వరూ గ్రామానికి వెళ్లకుండా పోలీసులు నియంత్రించారు.
ఏఎన్ఎంకు కరోనా పాజిటివ్