ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుపౌర్ణమి సందర్భంగా అంకమ్మతల్లికి ప్రత్యేక పూజలు - Ankammathalli special pooja on the occasion of Guru Purnima

ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

praksam district
గురుపౌర్ణమి సందర్భంగా అంకమ్మతల్లికి ప్రత్యేక పూజలు

By

Published : Jul 6, 2020, 7:33 AM IST

ఆషాఢ, గురు పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని అంకమ్మతల్లి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. కూరగాయలు, పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. శాకాంబరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లాక్​డౌన్ కారణంగా దేవాలయంలోకి భక్తులను అనుమతించలేదు. అలయ కమిటీ సభ్యులు అంకమ్మతల్లికి పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. కరోనా అంక్షలు కారణంగా ఎవరూ దేవాలయానికి రావొద్దని.. ఎవరి ఇంట్లో వారే అమ్మవారికి పొంగళ్లు సమర్పించుకోవాలని కమిటీ సభ్యులు ముందుగానే పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details