ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జలం లేక జీవం వదులుతున్న పశువులు.... - ప్రకాశం జిల్లా

నీటి కుంటల్లో నీరు లేక పశువులు చనిపోతున్న పరిస్థితి ప్రకాశంజిల్లాలో ఏర్పడుతోంది.అధికారులకు చెప్పినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని గ్రమస్థులు హెచ్తరిస్తున్నారు.

నీటి కోసం ఉరకలు పెడుతున్న పశువులు

By

Published : Jul 4, 2019, 6:22 AM IST

ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామ సమీపంలో నీటికుంటల్లో నీరు లేకపోవటంతో పశువులు చనిపోతున్నాయని పశుపోషకులు ఆవేదన చెందుతున్నారు. ఈవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనంలేకుండా పోవటంతో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి సమస్యను విన్నవించుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే గ్రామ సమీపంలో నీటి కుంటలను తవ్వించాలని అధికారులను ఆదేశించారు... అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవటంతో పశుపోషకులు ఆందోళనకు సిద్దమవుతామంటున్నారు... చల్లారెడ్డిగామం గ్రామ సమీపంలో ఉన్న చెరువు పూడిక పేరుకుపోయింది... ఉన్న కొద్దిపాటినీరు బరదమయం అయి దుర్గంధం వెదజల్లుతోంది.గ్రామమంతా పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నామని అధికారులు స్పందించి గ్రామ సమీపంలోని చెరువును తవ్వించి పశువులకు నీటి ఇబ్బంది లేకుండా చేయాలని లేకపోతే ఆందోళనలు చేస్తామని పశుపోషకులు చెపుతున్నారు.

గ్రామస్థుల ఆవేదన....

ABOUT THE AUTHOR

...view details