ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో ఆంధ్ర, దిల్లీ జట్ల మధ్య రంజీ క్రికెెట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో ఆంధ్ర జట్టు 87 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఆంధ్ర బ్యాట్స్ మెన్ రిక్కి బోయే 164 బంతుల్లో 8 బౌండరీలతో 70 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. కెప్టెన్ హనుమ విహారి 38, కరణ్ షిండే 48 పరుగులు, మనీష్ 42 పరుగులు చేయగా.. ఆంధ్ర జట్టు 35 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దిల్లీ బౌలర్ నవదీప్ సైనీ 31 ఓవర్ల లో 77 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, పవన్ సుయాల్ రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. అంతకు ముందు మొదటి రోజు దిల్లీ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 215 పరుగులకే ఆలౌట్ అయింది.
దిల్లీతో రంజీ.. ఆధిక్యంలో ఆంధ్ర - andhra vs delhi cricket teams ranji cricket match second day latest news
ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో ఆంధ్ర, దిల్లీ జట్ల మధ్య రంజీ క్రికెెట్ మ్యాచ్ రెండో రోజు ఆట.. క్రీడాభిమానులను అలరించింది. ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో 87 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయిన ఆంధ్ర జట్టు 249 పరుగులు చేసింది. మొదటి రోజు ఆటలో.. దిల్లీ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 215 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆంధ్ర, దిల్లీ జట్ల మధ్య రసవత్తరంగా రంజీ మ్యాచ్