ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర హై స్కూలు ఆవరణలో ఆనందయ్య 'పీ' రకం మందును నగర ప్రజలకు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు యువ పారిశ్రామిక వేత్త రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు మందు కోసం రావొద్దని నిర్వహకులు సూచించారు. గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మున్సిపల్ మైదానంలో పంపిణీ చేయనున్నారు.
కొవిడ్ లేని వారికి మాత్రమే..
ఆనందయ్య ఔషధం పరిమిత స్థాయిలోనే సరఫరా చేస్తున్నందన ప్రస్తుతం ఒంగోలు నగర వాసుల్లో కొవిడ్ బారిన పడని వారికి అడ్వాన్స్డ్ మందును మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారు మందు కోసం రాకూడదని స్పష్టం చేశారు.