ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కడవకుదురు రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోని చెట్టుకు ఉరేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న చినగంజాం ఎస్.ఐ అంకమ్మరావు చుట్టుపక్కల వారిని విచారించారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి - చినగంజాం మండలం
గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా చినగంజాం మండలం, కడవకుదురులో జరిగింది.

గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య