'రాజధాని మార్పు'పై అమరావతి పరిరక్షణ సమితి ఆందోళన - akhilapaksham meet in ongole
ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. అఖిలపక్ష సమావేశం జరిగింది. రాజధాని మార్పు ప్రతిపాదనలపై ఆందోళన వ్యక్తం చేసింది.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. రాజధానిగా అమరావతే ఉండాలని... ఎట్టి పరిస్థితుల్లోనూ మరో ప్రాంతానికి తరలించడానికి వీలు లేదని నేతలు డిమాండ్ చేశారు. రాజు మారిన ప్రతీసారి రాజధాని మారుస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ... రాష్ట్ర ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెడుతున్నారని మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విషయమై పోరాడేందుకు ఐక్య కార్యచరణ సమితిని ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ తెలిపారు. జిల్లా అంతటా రాజధాని పోరాటాలు ఉద్ధృతంగా కొనసాగించాలని తీర్మానించినట్టు చెప్పారు.