అమరావతి రైతుల పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. చిననందిపాడు గ్రామంలో జిల్లాలోకి చేరుకున్న రైతులు, మహిళల పాదయాత్రకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి సంఘీభావం తెలిపారు. చిననందిపాడు నుంచి జన సందోహం మధ్య పాదయాత్ర సాగింది. భోజన విరామ సమయానికి అమరావతి రైతుల పాదయాత్ర అడుసుమల్లి చేరుకుంది.
ప్రకాశం జిల్లాలో.. జోరుగా అమరావతి మహా పాదయాత్ర - ప్రకాశం జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి రైతుల పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. చిననందిపాడు గ్రామంలో జిల్లాలోకి చేరుకున్న రైతులు, మహిళల పాదయాత్రకు స్థానికులు ఘనస్వాగతం పలికారు.

అమరావతి రైతుల మహా పాదయాత్ర
ప్రకాశం జిల్లాలో జోరుగా అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి ఉద్యమానికి. అండగా ఉంటామంటూ రైతులు, మహిళలను అడుసుమల్లి ప్రజలు పూలతో స్వాగతించారు. రాజధాని అమరావతిని కాపాడుకుంటామని..పాదయాత్ర విజయవంతమవుతుందని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:Chandra babu: 'ఓ వైపు విధ్వంసం.. మరోవైపు ప్రజలపై భారం.. అదే జగన్ పాలన'