ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Amaravathi JAC:మోదీ బాటలో జగన్ నడవాలి..రాజధానిగా అమరావతిని కొనసాగించాలి: ఐకాస - అమరావతి వార్తలు

వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారని అమరావతి జేఏసీ (Amaravathi JAC) నేతలు స్పష్టం చేశారు. మోదీ బాటలోనే ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)​ కూడా నడవాలని కోరారు. అమరావతి రైతుల బాధను, రాష్ట్ర ప్రజల ఆవేదనను గుర్తించి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు.

మోదీ బాటలో జగన్ నడవాలి
మోదీ బాటలో జగన్ నడవాలి

By

Published : Nov 19, 2021, 5:18 PM IST

మోదీ బాటలో జగన్ నడవాలి

రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ చట్టాలు రద్దు చేయటం హర్షణీయమని రాజధాని ఐకాస (Amaravathi JAC) కన్వీనర్ పువ్వాడ సుధాకర్ అన్నారు. ప్రధాని నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. మోదీ బాటలో ముఖ్యమంత్రి జగన్ కూడా నడవాలని కోరారు. అమరావతి రైతుల బాధను, రాష్ట్ర ప్రజల ఆవేదనను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని (Amaravthi Capital) కొనసాగించాలని కోరారు.

రైతు పాదయాత్రకు బ్రేక్..

రాష్ట్రంలో భారీ వర్షాల ప్రభావం..అమరావతి మహా పాదయాత్రపై పడింది. ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా...ఇవాళ కూడా పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు. ప్రస్తుతం రైతులు గుడ్లూరులోని ఓ కల్యాణ మండపంలో బస చేస్తున్నారు. పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో నడవ లేని పరిస్థితి ఏర్పడింది. రైతులు వసతి, బస చేసే ప్రాంతంలోనూ వర్షపు నీరు చేరింది. మహిళలు ఇబ్బందులు పడకూడదనే పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ఐకాస నేతలు స్పష్టం చేశారు. రేపు గుడ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి

CHANDRABABU:'ఇది గౌర‌వ స‌భా..కౌరవ స‌భా'..: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details